Skip to content

ఉత్ప్రేక్షా కాళిదాసస్య!

30 జూలై, 2008

“ఉపమా కాళిదాసస్య” అన్నది ప్రసిద్ధమైన నానుడి. ఉపమాలంకారం వాడడంలో ఆయనను మించినవారు లేరని ప్రతీతి. కానీ ఉపమ లోనే కాదు. ఉత్ప్రేక్షాలంకారం లోనూ కాళిదాసుకు సాటిలేదు. ఈ క్రింది శ్లోకం చూడండి:-

“కుసుమే కుసుమోత్పత్తి: శ్రూయతే నతు దృశ్యతే

బాలే తవ ముఖాంబోజే దృశ్యమిందీవర ద్వయం”

– ‘పువ్వునుండి పువ్వు పుట్టుతుందని వినడమే గానీ ఎన్నడూ చూడలేదు. కానీ ఓ అమ్మాయీ, నీ ముఖమనే తామర పూవులో నాకు రెండు నల్ల కలువలు కన్పిస్తున్నాయి.’

కాళిదాసు మాత్రమే ఉత్ప్రేక్షించగల రమ్యమైన భావన అది!

ప్రకటనలు
8 వ్యాఖ్యలు
 1. 30 జూలై, 2008 8:07 సా.

  బాలే అనాలేమో! సంబోధన కదా. మంచి శ్లోకాన్ని పరిచయం చేశారు.

 2. 30 జూలై, 2008 8:42 సా.

  మీరు ఇంకా చెప్పండి.
  వినాలని ఉంది.

  బొల్లొజు బాబా

 3. చంద్ర మోహన్ permalink
  31 జూలై, 2008 12:13 ఉద.

  @ బొల్లోజు బాబా గారూ,
  కృతజ్ఞతలు.
  @ నాగమురళి గారూ,
  ‘బాలే’ అనే ఉండాలి. వ్రాసేటప్పుడు పొరబాటుగా పడింది. నెనర్లు.

  – చంద్ర మోహన్

 4. 31 జూలై, 2008 10:03 ఉద.

  చంద్రమోహన్ గారు,
  ఈ శ్లోకం తాలూకు (మా తెలుగు మాస్టారు చెప్పిన) కథని నా బ్లాగులో రాశాను చూడండి.
  మీకు తెలిసే ఉండొచ్చు. మీరు మరెన్నో మంచి టపాలు రాయాలని ఆశిస్తున్నాను.

 5. 31 జూలై, 2008 10:36 ఉద.

  బాబా గారి కామెంటే, నాది కూడా…

 6. 31 జూలై, 2008 4:28 సా.

  అవును నేను కూడా కాళిదాసు ఫేన్ ని. మీరు ఇంకా రాస్తే వారి గురించి తెలుసుకోవాలని చాలా కోరికగా ఉందండీ.

 7. 31 జూలై, 2008 4:35 సా.

  సంతోషం. అసలు అన్ని అలంకారాలూ ఉపమాలంకారానికి విభిన్న రూపాలే అని వక్కాణించిన ఒక లక్షణ శ్లోకం ఎక్కడొ చదివిన గుర్తు.
  పనిలో పని, ఇది రూపకాలంకారం, ఉత్ప్రేక్ష కాదు.
  ముఖము తామర పువ్వు వలె (అందముగా, సుకుమారముగా, ప్రకాశిస్తూ) ఉన్నది – ఉపమ
  ఇది ముఖము కాదు తామరపువ్వే – ఉత్ప్రేక్ష
  ముఖాంభోజము – రూపకం
  ఏదో నాకు తెలిసిన రెండు నయాపైసల సమాచారం.
  మంచి టపాలు రాస్తారని ఎదురు చూస్తుంటాం

 8. 1 ఆగస్ట్, 2008 9:21 సా.

  @ సుజాత గారూ,
  మీ బ్లాగు లోని టపా చూశాను. నా అభిప్రాయం కూడా అక్కడే వ్రాశాను. గమనించగలరు.

  @ రవి గారూ,
  నెనర్లు
  @ ప్రతాప్ గారూ,
  నెనర్లు. అలాగే “విబుధ వరుల వలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత…” వ్రాస్తూ ఉంటాను.
  @ కొత్తపాళీ గారూ,
  మీరు చెప్పినట్లు ‘ముఖాంబోజము’ రూపకాలంకారమే. ఇక్కడ ఉత్ప్రేక్ష ‘ ఇందీవర ద్వయం’ అన్నది. కళ్ళని ఎక్కడా ప్రస్తావించకుండా నల్లకలువలువలనడం ద్వారా ఆ కళ్ళు కలువలే అన్న భావాన్ని స్ఫురింపజేయడం ఇందులోని చమత్కారం.

  నెనర్లు.

  – చంద్ర మోహన్

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: