Skip to content

నా హైకూలు

27 అక్టోబర్, 2008
 • రాని నీ నిరీక్షణలో రాత్రి గడిపేకన్న

  నిదురించి తీయని స్వప్నాల లోనైన

  నిన్ను వీక్షించియున్న బాగుండునేమొ!

 • నన్ను పూర్తిగా నమ్ముతున్నానంటావు, మరుక్షణం

  నావంక చూస్తావు, నీ మాటలు నమ్ముతున్నానో లేదో అని

  ఎలా అర్థం చేసుకోవాలి నిన్ను నేను!

 • నా ఆకాంక్షలు, అవిగో అక్కడ దగ్ధమైపోతున్నాయి

  సుళ్ళు తిరుగుతూ లేస్తున్నవి చితిమంటలే కావు

  నా మదిలోని వేదనా జ్వాలలు కూడ

 • NOTE: హైకూలు జపాను వారి పద్య ఛందో విశేషం. మొత్తం 17 అక్షరాలు (మాత్రలు కాదు) మూడు పాదాల్లో 5,7,5 లెక్కన రావాలి. హైకూల గురించి మరిన్న వివరాలకోసం ఇక్కడ చూడవచ్చు.

  జపానీయ హైకూలను అనుకరిస్తూ తెలుగులో ఒకానొక కాలంలో కోకొల్లలుగా హైకూలు వ్రాశారు చాలామంది. అందులో 99% నిజమైన హైకూల లక్షణాలకు ఆమడ దూరంలో ఉన్నవే, పైన వ్రాసిన నా హైకూలతో సహా. మూడు పాదాలలో విరిచి వ్రాసినవన్నీ హైకూలు కాలేవు. జపానీయ హైకూల లక్షణం మార్మికత. క్లుప్తంగా ఉంటూ, సూటిగా ఏదీ చెప్పకుండా పాఠకుని అలోచనలను ప్రేరేపించాలి హైకూ. అది తెలుగులో కష్ట సాధ్యం. మనకు మనవైన ముత్యాల సరాలు, ఉపజాతి పద్యాలు, కూనలమ్మ పదాలు, నానీలు ఉండగా, మనవి కాని ఛందో సాంప్రదాయాన్ని పట్టుకొని వేళ్ళాడడం వృధా ప్రయాస అని తెలిసి పోయాక నేను హైకూలు వ్రాయడం మానేసి, తెలుగు సాహితీ లోకానికి చాలా ఉపకారం చేశాను. అలాగే నేను ప్రయత్నించి ఓడిపోయిన మరో ప్రయోగం వచన కవిత. ఇప్పటి వరకూ నేను ఒకే ఒక వచన కవిత(!) వ్రాశాను. ఛందస్సు లేని కవితా వ్యాసంగం నా ఒంటికి పడదనే గ్రహింపు త్వరగానే వచ్చింది. ఇక వచన కవితల జోలికి పోలేదు నేను.

  Distant Early Warning: నేను వ్రాసిన ఆ ఏకైక వచన కవితే నా తరువాతి టపా 🙂

  ప్రకటనలు
  14 వ్యాఖ్యలు
  1. 27 అక్టోబర్, 2008 8:06 సా.

   హైకూకి మార్మికత ఒక్కటే కాదు లక్షణం. భావాన్ని వెలిబుచ్చే పద్ధతిలో కూడా దానికో సొంత పద్ధతి ఉంది. సాంప్రదాయకంగా బాషో వంటి మహానుభావులు రాసిన జపనీయ హైకూల్లో ప్రకృతి ఆరాధన, పద చిత్రాలు కూడా విశేషంగా కనబడతాయి.
   ఒక సూచన – మీ పై రచనలు వేటికవి బాగున్నై కానీ, వాటిల్ని హైకూలు అనొద్దు.

  2. చంద్ర మోహన్ permalink
   27 అక్టోబర్, 2008 9:08 సా.

   @కొత్తపాళి గారు,
   మీరు చెప్పింది నిజమేనండి. నేను వ్రాసినవి హైకూ లు కావు అనడంలో నాకు ఇసుమంతైనా సందేహం లేదు. టపాలో నేను చెప్పింది కూడా అదే. తెలుగులో హైకూలంటూ వ్రాసిన వారిలో చాలామంది ఇలాగే, నాలాగే వ్రాశారని నా అభిప్రాయం. వీటిని హైకూలనడం ‘Misnomer’. నా ఉద్దేశ్యంలో తెలుగులో నిజమైన ‘హైకూ’ లు వ్రాయలేం. అది మనకు సూటవదు.

  3. 27 అక్టోబర్, 2008 9:12 సా.

   మీరు చెప్పేవరకూ మీర్రాసినవి చందోబద్దమైన హైకూలు కాదన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చేమో. హైకూలని ఒప్పుకోని మీ ఈ హైకూలలో నాకు కొంత సాంప్రదాయ పద్య నిర్మాణం కనిపిస్తుంది. (ఎక్కడ అని అడక్కండి నేను చెప్పలేను)

   తెలుగులో చాలామంది హైకూలు చదివినా ఇస్మాయిల్ గారి హైకూలు ఎందుకో నచ్చుతాయి. వారు మీరు చెప్పిన చందస్సులో వ్రాసారో లేదో తెలియదు కానీ, అవి మంచి పదచిత్రాలతో, లేదా మార్మికతతో ఉంటాయి.
   నాకు నచ్చినవి కొన్ని. ఇప్పుడే గమనించాను ఇవి మీరు చెప్పిన సూత్రాలకు లోబడి లేవు.

   ఇద్దరికీ సంబరమే
   సముద్రపొడ్డున జనానికి
   జనాల ఒడ్డున సముద్రానికి

   సంజె వేళ
   దీపాలు వెలిగించారు
   ఎవరి దీపాలు వారివే

   రాత్రికి
   ఎన్ని దీపాలంకరణలు
   పగటికి సూర్యుడొక్కడే

   ఎండకే
   మెరుగు పెడుతుంది
   వెల్లగోడ

   డాబా క్రింద పూలచెట్లు
   డాబాపై ఆరేసిన చీరలు
   ఎవరెవరికి అనుకరణ్?

   గుండె బీటపడితే
   దిగుళ్ళు తప్ప
   అన్నీ కారిపోతాయి

   రాత్రి హోరున వర్షం
   ఉదయం లేచి చూస్తే
   ఎదురింటాయనకు రెండు మేడలు.

   I know it is an irrelevant comment. Then why I typed all this stuff I dont know. probably i just wanted to share my pleasure thats all. Please bear with me. if not excuse me.
   thankyou

   bollojubaba

  4. 27 అక్టోబర్, 2008 10:20 సా.

   @ Baba .. not irrelevant at all.
   You gave us a chance to re-enjoy some beautiful poetry. And thank you for that!

  5. 28 అక్టోబర్, 2008 12:20 ఉద.

   బాబా గారు ఆ హైకూలు ఇక్కడ పంచుకున్నందుకు నెనర్లు!

   నేను చదివిన అచ్చ తెలుగు హైకూల్లో, అత్యద్భుతం అనిపించింది ఈ కిందిది:

   గోడలో పూచిన పూవు
   పరిచయం చేసింది
   మా గోడను.

   హైకూల్లో అందం తెలియాలంటే ఈ కింది వ్యాసాన్ని చూడగలరు:
   http://www.eemaata.com/em/library/karunamukhyam/930.html

  6. చంద్ర మోహన్ permalink
   28 అక్టోబర్, 2008 11:56 ఉద.

   @ బాబా గారు,
   మంచి కవితలను పంచుకున్నందుకు నెనర్లు. నిజానికి నా టపా కన్న మీ కామెంటే బాగుంది.
   “రాత్రికి
   ఎన్ని దీపాలంకరణలు
   పగటికి సూర్యుడొక్కడే”
   ఇలాంటివి కొంత హైకూల ఆత్మను పట్టుకున్నట్టనిపిస్తాయి. 17 అక్షరాల్లో చెప్పాలనుకున్నవి చెప్పెయ్యడం జపాను భాషలోనే కుదురుతుందేమో. దేన్నైనా చిన్నది చేసెయ్యడం వారికలవాటు కదా!

   @ పూర్ణిమ గారు,
   మంచి వ్యాసాన్ని పరిచయం చేశారు. హైకూ గురించి ఇస్మాయిల్ గారు అద్భుతంగా వివరించారు. నెనర్లు.

  7. pappu permalink
   29 అక్టోబర్, 2008 1:00 సా.

   అంతే..అంతే…పక్కింటి పుల్ల కూర ఎప్పుడూ రుచిగానే ఉంటుంది…మనకి దేశ భక్తి లేకపోడంలొ పెద్ద విశేషం లేదు…పాస్స్పోర్ట్ చూడగానే ఎగా దిగా చూస్తాడు ప్రతీ వెధవా ఇమ్మిగ్రేషన్లో…అందుకే…

  8. 29 అక్టోబర్, 2008 11:09 సా.

   @ pappu
   ??

  9. madhu permalink
   30 అక్టోబర్, 2008 5:52 ఉద.

   Wide boll 🙂

   pappu’s comment is not for this post..guess 🙂

  10. 30 అక్టోబర్, 2008 10:47 సా.

   పప్పు గారి కామెంటు

   గొప్ప మార్మికత తో,
   మాంచి పదచిత్రంతో
   భావాలను వెలిబుచ్చటంలో సొంతపద్దతితో (చూ. కొ.పా గారి కామెంటు)
   అద్బుతమైన హైకూ లా ఉంది.
   కానీ అక్షరాల సంఖ్యే పొసగటం లేదు.

   సరదాగానే సుమా 🙂

  11. 31 అక్టోబర్, 2008 8:18 ఉద.

   @ బాబా గారు,
   🙂

  12. 25 జనవరి, 2009 8:41 సా.

   మీరన్నారు హైకూలో 5,7,5 అక్షరాలు వుండాలని. నేను వికీలో చదివిన హైకూలు కూడా అలానేవున్నాయి.
   ఉదా –
   furuike ya
   (古池 や)
   (fu/ru/i/ke ya): 5
   kawazu tobikomu
   (蛙 飛込む)
   (ka/wa/zu to/bi/ko/mu): 7
   mizu no oto
   (水 の 音)
   (mi/zu no o/to): 5

   కానీ మీరు వ్రాసిన వాటిలో పాదానికి చాలా అక్షరాలు వున్నాయిగా.
   అయినా వాటిని హైకూలు అనవచ్చా ?
   నేను అడుగుతున్నది కేవలం ఛందోబద్ధంగా , అంటే మార్మికత వగైరా వంటి అంశాల గుఱించి కాదు. 5,7,5 అక్షరాలు లేకున్నా హైకూలవుతాయా ?

   మీ రాకేశ్వరం

   త.క – మీ టపాలన్నీ వరుస పెట్టి ఇప్పుడే చదువుకొస్తున్నాను, కాబట్టి ఈ ఆలస్యపు వ్యఖ్యలను క్షమించగలరు.

  13. కోడీహళ్లి మురళీ మోహన్ permalink
   25 జనవరి, 2009 10:12 సా.

   http://turupumukka.blogspot.com/2009/01/kieku.html

  14. చంద్ర మోహన్ permalink
   7 ఫిబ్రవరి, 2009 11:38 సా.

   రాకేశ్వరా,
   ౫-౭-౫ లేకుంటే అది హైకూ కాలేదనే నా అభిప్రాయం. కానీ తెలుగులో హైకూ అని పేరుపెట్టి వ్రాసిన వారెవరూ అలా వ్రాయలేదు. ఈ మధ్య ’ఊకదంపుడు’ బ్లాగులో కొన్ని హైకూలు ప్రయత్నించారు చూడండి!

   ఆలస్యంగానైనా నా టపాలు ఓపికగా చూసినందుకు నెనర్లు!

  వ్యాఖ్యలను మూసివేసారు.

  %d bloggers like this: