విషయానికి వెళ్ళండి

తగని కోపమ్మదేలనో తమిళమన్న!

11 జనవరి, 2010

“తమలపాకులు నములు
దవడతో మాట్లాడు
తానె వచ్చును తమిళు
ఓ కూనలమ్మా”

– ఒక తెలుగు కవి వెటకారం!

“డాయకుమీ అరవ ఫిలిం…”

– మరో మహాకవి ప్రబోధం

“అరవం అరవం అంటారు, మళ్ళీ అరుస్తూనే ఉంటారెందుకో!” ఒక తెలుగు మీరినాయన ‘పన్ నాగం’!

“అరవ్వాడి దోశై
మీద తోచింది వ్రాసెయ్…” – మహా కవి భరోసా, మళ్ళీ!

“తెలుగు తేటె, కన్నడ కస్తూరి, అరవ అధ్వాన్న” –  ఒక కన్నడ భాషీయుని ఉటంకింపు.

నా చిన్నతనంలో ఇలాంటివి చదివినప్పుడు ఒళ్ళు మండిపోయేది ( ఇప్పుడు నవ్వేస్తాననుకోండి). మా భాషపై ఎందుకు వీళ్ళకింత అకారణ ద్వేషమని ఆశ్చర్యం కలిగేది. ఇలాంటివి తమిళంలోనూ ఏవైనా ఉంటే మనమూ చెబుదామని వెదికే వాడిని. అబ్బే, ఇతర భాషలను కించపరిచే రచన ఒక్కటికూడా తమిళ సాహిత్యంలో కనిపించలేదు నాకు. చిన్నప్పుడు అన్నింటికన్న నన్ను ఎక్కువగా నొప్పించిన పద్యం శ్రీనాధుని పేర చెలామణీ అవుతున్న చాటువొకటి:

మేతకుఁ గరిపిల్ల, పోరున మేకపిల్ల
పారుబోతు తనమ్మున పందిపిల్ల
ఎల్ల పనులను జెరుపంగ పిల్లి పిల్ల
అందమునఁ గోతి పిల్ల, ఈ యరవ పిల్ల

ఈ పద్యం శ్రీనాధుడు వ్రాసినదేనా అని నాకు ఇప్పటికీ సందేహమే (శైలిని బట్టి). తరువాత ఎప్పుడో  శ్రీనాధుడు వ్రాసిన ఈ క్రింది పద్యం, కాశీఖండం లోనిది, చదివాను:

ముడువంగ నేర్తురు మూలదాపటికి రా
చికురబంధములీగ జీరువార
పొన్నపూవుల బోలు పొక్కిళ్ళు బయలుగా
గట్టనేర్తురు చీర కటిభరమున
తొడువంగ నేర్తురు నిడువ్రేలు చెవులయం
దవతంసకంబుగా నల్లిపూవు
పచరింప నేర్తురు పదియారు వన్నియ
పసిడి పాదంబుల పట్టుచీర

పయ్యెద ముసుంగు పాలిండ్ల బ్రాకనీక
తఱచు పూయుదురోల గందంపుఁ బసుపు
బందికత్తెలు, సురత ప్రసంగ వేళ
కంచి యరవతలసమాస్త్ర ఖడ్గ లతలు

ఒకప్పుడు కోతిపిల్ల లాగానూ, మరొకప్పుడు అసమాస్త్రుని ఖడ్గ లతల్లాగానూ అరవతలు ఎలా కనిపించారా అనిపించేది. ఐతే శ్రీనాధుని బాగా చదివాక, అతని నోటికి అడ్డూ ఆపూ ఏదీ లేదని తెలుసుకున్నాక శ్రీనాధునిపై నా కోపం పోయింది. తమిళులనేమిటి? ఎవరినైనా అలాగే అనగలడు కదా శ్రీనాధుడు! ” కర్ణాట కామినీ కర్ణహాటక రత్న తాటంక యుగ ధాళ ధాళ్యములకు…” జోహారులర్పించిన నోటితోనే ” వసివాళ్వారుచు వచ్చుచున్నయది కర్ణాటాంగనన్ గంటిరే!” అని మనల్ని పిలిచి మరీ చూపించగలడు.

విషయానికి వస్తే, పొరుగు భాషల వారికి తమిళంపై ద్వేషమో, చిన్నచూపో ఎందుకుండాలన్నది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది నాకు. “సుందర తెలుంగినిల్ పాట్టిసైత్తు …” అంటూ సింధు నదిలో వెన్నెల రాత్రి సుందరమైన తెలుగులో పాట పాడుతూ చేర దేశపు పడతులతో నౌకా విహారం చేయాలని కలలు కన్న భారతియార్ ఇతర భాషలకన్న నాభాష గొప్పదని ఎన్నడూ చెప్పలేదు. ఆ భాషపై తెలుగువారికింత చిన్న చూపు ఎప్పుడొచ్చింది! తమిళ కుటుంబానికి చెందిన మాస్తి వెంకటేశం అయ్యంగార్ కన్నడంలో గొప్ప రచనలు చేసి జ్ఞానపీఠ అవార్డును తెచ్చిపెట్టాడు. ఆ భాషీయులంటే కన్నడిగులకెందుకు ద్వేషం ఉండాలి!

మనకున్నదేదో వాడికి లేదనే అహంకారం ఒకటి, వాడికున్నదేదో మనకు లేదన్న అసూయ ఒకటి – ఎదుటివాడిపై చిన్నచూపు కలగడానికివి రెండే కారణాలు. తెలుగు, కన్నడ భాషలు రెండూ కూడా పరభాషల ప్రభావానికి సులభంగా లొంగి పోయాయి. పరాయి భాషలు భాష మూలస్వరూపాన్నే మార్చేస్తున్నా నిస్సహాయంగా ఉండిపోయాయి. అదే సమయంలో, తమిళ భాష తన వ్యక్తిత్వాన్ని నిలుపుకొంటూ ఎదిగింది. తంజావూరులో తెలుగు నాయకరాజుల పాలన కొనసాగి, తెలుగు సాహిత్య పునరుజ్జీవనం అక్కడ జరిగినప్పుడు కూడా తమిళం తన ఉనికిని కోల్పోలేదు. ఈ ప్రత్యేకత, భాషకున్న ఈ వ్యక్తిత్వం బహుశ ఇతరులలో అసహనాన్ని కలిగించింది. నలుగురు నడిచేదారిని కాదని సొంత మార్గాన్ని ఎంచుకోవడం వలన తమిళ భాషీయులు వారి సోదర భాషలనుండి శాశ్వతంగా విడిపోయారు. వారిని కలిపిఉంచిన బంధమేదో తెగిపోయింది. తెలుగు, కన్నడ భాషలు కాలప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. తమిళం ఎదురీదుతోంది. దూరం పెరిగి పోతోంది.

తమిళ దేశంలోనే సంస్కృత భాషను ‘ప్రమోట్’ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. స్వామినాథ దేశికర్ అన్న సంస్కృత పండితుడు ‘ఇలక్కణక్కొత్తు’ అన్న గ్రంథంలో ఇలా వ్రాశాడు:

ఐన్దు ఎழுత్తాల్ ఒరు పాడైయుం ఆమ్‌ ఎన్ఱు
అఱైయవుం నాణువర్ అఱివురైయోరే

‘సంస్కృతంలో లేనివి, తమిళంలో ఉన్నవి ఐదే అక్షరాలు (ఎ, ఒ అనే అచ్చులు, ఱ,ந (న), ழ అనే మూడు హల్లులు). ఓ ఐదక్షరాలు ఎక్కువున్నంత మాత్రాన తమిళమూ ఒక గొప్ప భాషైపోతుందా, పండితులు దాన్ని ఒప్పుకొంటారా’ అని తమిళాన్ని పరిహసిస్తూ ఒక సూత్రమే వ్రాశాడు. ఐతే జనుల హృదయాల్లో తమిళమే నిలిచింది, పరిహసించిన గ్రంధాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి.

పెరిగి పెద్దవాడై, నాలుగూళ్ళు తిరిగాక, భాషా భేదాలు, ఎక్కువ తక్కువలు మనసుకు పట్టడం తగ్గిపోయింది. ఒక భాష మరో భాషకన్న గొప్పదనో, తక్కువనో అనుకోవడం ఎంత మూర్ఖత్వమో తెలిసింది. నేను మైసూరుకు బదిలీ అయి వచ్చినప్పుడు కన్నడ భాషంటే కొంత వ్యతిరేకత ఉండేది, వారి తమిళ వ్యతిరేకతకు రియక్షన్ అన్నమాట. నాకు కొంత భాష తెలిసినా తెలియనట్లే స్థానిక అధికారులతో, ప్రజా ప్రతినిధులతో హిందీలోనో ఆంగ్లంలోనో మాట్లాడేవాడిని. ఐతే మెల్లగా ఇక్కడ కన్నడ సాహిత్య చర్చలు వినడం, వారి భాషను కాపాడుకోవడానికి వారు పడుతున్న తపనను దగ్గరినుండి చూడడం నాలో చాలా మార్పును తెచ్చింది. వారి భాషను నిలుపడానికి నా వంతు ప్రయత్నం చేయాలనిపించింది. గత రెండేళ్ళుగా కార్యాలయంలో నేను కన్నడ భాషీయులతో వారి భాషలోనే మాట్లాడుతున్నాను. ప్లాంటులోని సూచనాఫలకాలను కన్నడభాషలోకి అనువదింపజేసి ప్రదర్శింపజేశాను.Instruction Manuals ను కన్నడ భాషలో ముద్రింపజేశాను.

ప్రాచీన తమిళ గ్రంధమైన ‘పుఱ నానూఱు’ లో పూంగుండ్రనార్ అనే కవి ఇలా అంటాడు:

యాదుం ఊరే, యావరుం కేళిర్…
… … … … …
పెరియోరై వియత్తలుం ఇలమే
శిరియోరై ఇగழ் దల్ అదనినుం ఇలమే

(ప్రతి ఊరూ నా స్వగ్రామమే, అందరూ నా వారే…
… … పెద్దవారని ఎవరినీ భట్రాజులా కీర్తించనూ లేదు, చిన్నవారని ఎవరినీ తక్కువగా చూడనూ లేదు)

రెండున్నరవేల యేళ్ళనాటి పై పద్యపాదాలు ప్రతిబింబించే తమిళ సంస్కృతికి అనుగుణంగా ఉండాలన్నదే నా క్రొత్త సంవత్సర నిర్ణయం, “అరవ అధ్వాన్న” అనుకున్నా సరే 🙂

24 వ్యాఖ్యలు
  1. 11 జనవరి, 2010 2:20 ఉద.

    ఇంత saneగా తమిళ భాషమీద మాట్లాడిన తమిళాభిమాని మీరే. నాకు అరవభాషంటే ఎట్టి కోపమూ లేదు. ఐతే గీతే కాస్త ఇష్టమే. రెండేళ్ళు రూమ్మేట్ ఉంటే కాస్త నేర్చుకున్నాను కూడా. ఒక ఫనటిస్టిక్ ధోరణితో వాళ్ళు వాళ్ళ భాషను కాపాడుకున్న తీరు చూస్తే ముచ్చటేస్తుంది.
    ఇక మీ ప్రశ్నకు సమాధానమివ్వాలంటే, నాకు తెలిసి తమిళుల మీద మిగిలిన వారికి ప్రధానంగా ఒక కంప్లైంటు. ఇద్దరు తమిళులు కలిస్తే వారి చుట్టు ఎంతమంది తమిళం రాఇ వారున్నా ఖచ్చితంగా తమిళంలోనే మాట్లాడుతారు. సోషల్ ఎటికెట్ ఇలాంటివన్ని గట్టున పెట్టి. ఎక్కడైనా ఎక్సెప్షన్సుండవచ్చేమో కానీ ఇది ముమ్మాటికీ రూలే. వేరే ఏ భారతీయుల్లోనూ ఇదుండదు. అందుకే ఇలాంటి కుళ్ళు జోకులు.

  2. 11 జనవరి, 2010 4:50 ఉద.

    Well said and narrated…i agree completly with u sir

  3. Malakpet Rowdy permalink
    11 జనవరి, 2010 5:15 ఉద.

    భలే నవ్వు తెప్పించారండీ. అర్జెంటుగా నా తమిళ ఫ్రెండ్ ఒకడికి (మీలాగే వాడు కూడా తెలుగులో ప్రావీణ్యమున్నవాడే) ఫోన్ చేసి చెప్పాలి. వాడిని ఏడిపించి చాలారోజులయ్యింది :))

  4. Malakpet Rowdy permalink
    11 జనవరి, 2010 5:17 ఉద.

    ఇక మీ ప్రశ్నకి వస్తే తమిళులపై ఉండే కోపం తమిళభాషపై కోపంగా మారిందనే నా ఉద్దేశ్యం.

  5. 11 జనవరి, 2010 6:25 ఉద.

    ఇదే ముక్క నేన్జెప్తే తెలుగుభాషాభిమానం లేదంటారండీబాబూ!

  6. రహంతుల్లా permalink
    11 జనవరి, 2010 9:51 ఉద.

    ఎవరి తల్లి వారికిష్టం.ఎవరి మాతృభాష వారికి గొప్ప.సంస్కృతాన్ని కాదని LONG LIVE CLASSICAL DIVINE TAMIL అని తమిళులు వారి భాషాభివృధ్ధి కోసం శ్రమిస్తున్నారు.తమిళుల భాషాభిమానానికి వాళ్ళను మెచ్చుకోవాలి.తమిళనాట ముస్లిములు కూడా మసీదుల్లో ఉర్దూ అరబీ భాషలకు బదులు తమిళంలోనే మతవ్యవహారాలు నడుపుకొంటున్నారు.మనం కూడా తెలుగును మన తల్లి భాషగా దేవభాషగా LONG LIVE CLASSICAL DIVINE TELUGU అంటూ గౌరవిద్దాం.మత వ్యవహారాల్లో క్రైస్తవులు ఎలా తెలుగును వాడుతున్నారో అలా మిగతా మతాలు కూడా తెలుగును విస్తారంగా వాడాలి.భాషకు వాడుకే ప్రాణం.వాడని భాష పాడుపడుతుంది.

  7. nagamurali permalink
    11 జనవరి, 2010 11:49 ఉద.

    చాలా బాగుందండీ. అన్ని భాషల్లోనూ అన్ని రకాలవాళ్ళూ ఉంటారు. మనకి పెద్దగా తెలియనివాళ్ళని స్టీరియోటైపింగ్ చెయ్యడం, వాళ్ళంటే ఏవో భయాలు పెంచుకోవడం కూడా చాలామంది ‘పామరులు’ చేసే పనే. తెలుగువాళ్ళని గౌరవంగా, అభిమానంగా చూసే తమిళులు నాకు తెలుసు. మాకు కొంతమంది తమిళ స్నేహితులు ఉన్నారు. ఒకళ్ళ అపోహల గురించి ఒకళ్ళం తెలుసుకుంటూ నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. మీరు ఉటంకించిన కవుల హాస్యాలు కొన్ని మోతాదు మించకుండా హాయిగానే ఉన్నాయి. ఎవడి గురించి జోకు వేశామో వాడు కూడా విని నవ్వుకునేలా ఉంటేనే అది మంచి హాస్యం అని ఒక పెద్దాయన నిర్వచనం.

    ఏదేమైనా ఈ టపా లాంటి sane voices ఇంకొంచం గట్టిగా వినిపిస్తూ ఉంటే బాగుండునని అనిపిస్తూ ఉంటుంది.

  8. 11 జనవరి, 2010 1:50 సా.

    తెలంగాణ ఉద్యమం నుండి స్ఫూర్తిపొందారా?
    మీనుండి ఇలాంటి టపా చదవడం నాకు కాస్త నిరాశఁ గలిగించింది. ఇన్ని భాషలు వచ్చిం తరువాత కూడా మీరు ష్టీరియోటైపుల మీద కాస్త సీరియస్సు గానే వ్రాసారని. ఇప్పటికే ‘ఆంధ్రుల’ మీద, తెలంగాణా వారిని చిన్న చూపు చూశారు, అని జెప్పి నానా ఆస్తి నష్టం ప్రాణ నష్టం కలిగింపఁజేస్తున్నారు. చిన్న చూపు అనేది ప్రక్కవారికి మనం అవకాశం ఇస్తేనే వారు మనల్ని చూడగలరు. వివేకానందుణ్ణి కూడా అమెరికా వెళ్ళిన కొత్తలో చిన్నచూపు చూసినా, ఆయన పిల్లలు తెలియదు వారికి, అని ఎటువంటి మనస్తాపం చెందడు. మీరిప్పుడా స్థాయికి వెళ్ళినా, ఇలా జనాల రా ఎమోషన్లను ప్రేరేపించే టపా వేయరాదు. మీ ఉద్ధేశం అది కాకపోయినా ఇక్కడ ఆ పెడదారి పట్టే ప్రమాదం వుంది. అసలే కాలం బాలేదు. చిల్లర విష్ణువులో మీరు అలా మఱీ సీరియస్ అయిపోయేవారిని హేళన చేయడం నాకు బాగా నచ్చింది.

    నా వ్యక్తిగత అభిప్రాయానికి వస్తే, “కన్నడ కస్తూరి అరవ అధ్వాన్న” అంటే, నాకూ నూరుశాతం అలానే అనిపించింది మఱి! (తెలుఁగు పై పక్షపాతం వుంటుందని ప్రక్కనపెట్టినా). అలాగని తమిళం యొక్క సాహిత్యపురాతనత్వం మిగిలిన రెంటికీ లేవనీ తెలుసుఁ. భషలవియలంలోనేనేం, మనుషుల విషయంలో కూడా ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు.

    ఆ భారతీయార్ మాటని నేను నా మలయాళీ స్నేహితురాళ్ళకు చెప్పి కాస్త ఐసు పూయడానికి ప్రయత్నించిన సందర్భాలు చాలానేవున్నాయి. వాళ్ళెవ్వరూ నమ్మలేదు! కల్పించి చెబుతున్నాననుకున్నారు 😀

  9. Krishna permalink
    11 జనవరి, 2010 4:54 సా.

    I did not like this post! Who told they never told about Telugu! The tamils are doing language terrorism. YOu might have not experienced the head-strong of tamilians. They do scold all other language like hell! You just looked into the past, just got 2 to 3 stanzas and pasted here.

    So many great personalities we know who soared in the literature of tamil being telugus. I never saw a telugu person showing that much affection towards Tamil! There is no Tamilian who shows affection on other languages! They just crawl for their language shaving the back of other’s.

    You might have origins from Tamilians sir! I did not really like this post! Sorry for that!

  10. 11 జనవరి, 2010 11:06 సా.

    రాకేశ్వరా!

    మిమ్మల్ని నిరాశ పరచినందుకు క్షమాపణలు. నేను ఈ టపాని సరదాగానే వ్రాశాను (కనీసం అలా అనుకున్నాను). భావోద్వేగాలు రెచ్చగొట్టే ఉద్దేశ్యం ఎంతమాత్రం లేదు. తెలుగులో టపా చదివి రెచ్చిపోయే తమిళులు ఎంతమంది ఉంటారని మీ అంచనా! ఇందులో సీరియస్ విషయమేదైనా ఉంటే అది – ‘ భాషల మధ్య ఆరోగ్య కరమైన స్ఫర్థకు బదులు ఈసునసూయలు ఎందుకుంటున్నాయ’న్న ఆలోచన మాత్రమే. నా చిన్నప్పటి అనుభవాలు, పెద్దయ్యాక నేను నేర్చుకున్న పాఠాలు మాత్రమే ప్రస్తావించాను కానీ వివాదాలు రావచ్చన్న ఆలోచన అస్సలు రాలేదు నాకు.

    “కన్నడ కస్తూరి” కే మీ ఓటన్నారు, ಹಾಗೇ ಆಗಲಿ. ಬಹಳ ಸಂತೋಷವೇ 🙂 ఇక మలయాళ అమ్మాయిల విషయమంటారా – పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రమైతే ఎలాగండీ! భారతియార్ పనికి రాడక్కడ. వయలార్ రామవర్మను ట్రై చేయండి. ఈ సారి మలయాళీ ఎన్‌కౌంటర్ ఏదైనా ఉంటే ఐడియాల కోసం ముందుగా నాకో మెయిల్ చెయ్యండి 🙂

    @Krishna,

    Despite of all I said above, I did expect at least one comment like this 🙂

    “Who told they never told about Telugu! ”
    — Well, No body told. I just found out after reading a lot of Tamil Literature. If you know of some thing to prove my findings wrong, please let me know.

    “The tamils are doing language terrorism.”
    — Just another stereotype. What do you understand by the phrase Language Terrorism? How it works?

    “You might have not experienced the head-strong of tamilians.”
    — Yes sir! Of course I did. Actually, I’m one 🙂 But I did not see any of them doing what you said they do.

    “You just looked into the past, just got 2 to 3 stanzas and pasted here.”
    — The post is essentially about my past experiences. And yes, I just got 2 to 3 stanzas and pasted here, because pasting whole books would consume bit too much of blog space 😀
    Seriously, I would rather like you pasting a few stanzas of your own to prove my point wrong, and teach me a lesson or two.

    “You might have origins from Tamilians sir!”
    — You catch me right here! I definitely have my origins strongly and deeply rooted in Tamil. But that never affected my love for other languages.

    Finally, You have all the rights to dislike my post and thank you for telling it to me.

  11. 11 జనవరి, 2010 11:17 సా.

    @ బుడుగు, శరత్ గారు,మలక్‌పేట్ రౌడీ, రహంతుల్లా
    అందరికీ ధన్యవాదాలు.
    @ మహేష్
    ధన్యవాదాలు! నాకున్న మరో అడ్వాంటేజ్ తెలిసింది:)
    @ నాగ మురళి
    ధన్యవాదాలండీ! మీరు చెప్పినట్లు కవుల హాస్యాలు సరదాగానే ఉన్నాయి. నేను చిన్నప్పుడు ఎలా ఫీలయ్యేవాడినో చెప్పానంతే. మీ స్నేహితుల లిస్టులో నా పేరు కూడా చేర్చగలరు!

  12. షణ్ముఖన్ permalink
    12 జనవరి, 2010 11:59 సా.

    తమిళులు మిగతా వాళ్ళని చిన్న చూపు చూస్తారని విన్నాను కాని, ఈ చోద్యం నేను ఎప్పుడూ చూడలేదు.

    మీరు చెప్పిన దాన్లో
    “తెలుగు తేటె, కన్నడ కస్తూరి, అరవ అధ్వాన్న” – ఒక కన్నడ భాషీయుని ఉటంకింపు.
    ఇది ఒక్కటి మాత్రమే ఇబ్బందిగా వుంది. మిగతా వాటిలో నాకేమీ వ్యతిరేకత కనిపించలేదు, అవి ఇతరులను నొప్పింపని స్వంత అభిప్రాయాలు.

    రాకేశ్వర్ గారు చెప్పినట్లు
    భాషలవిషయంలోనేనేం, మనుషుల విషయంలో కూడా ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు.

    (ప్రతి ఊరూ నా స్వగ్రామమే, అందరూ నా వారే…
    … … పెద్దవారని ఎవరినీ భట్రాజులా కీర్తించనూ లేదు, చిన్నవారని ఎవరినీ తక్కువగా చూడనూ లేదు)

    ఈ విషయాన్ని ముందు మీరే (మీరే అంటే మీరు కాదు) గ్రహించాలి.

    సర్వేజనాః సుఖినోభవంతు – ఈ కొత్త సంవత్సరంలో ఇదే నేను కోరుకొనేది.

    “క్షోణితలంబు నున్నుదురు తాకంగ వందనంబు తెలుగు తల్లికి”

  13. Krishna permalink
    13 జనవరి, 2010 7:51 సా.

    Hi…

    I got a nose-bleeding reply for my comment! 🙂 I expected this!
    Actually I regretted after pressing submit button, but here, I just give a try to support myself! 🙂

    How do you feel if a project member and manager talking in tamil in a project discussion even after another mate asking them to talk in English as they are unable to follow them, and the answer was just like, it is not regarding you or your friends’?
    That guy just bashed the manager on his face scolding – ‘Arava naayaallaaraa’ and send a mail across the team, delivery head and to HR to compel team members to talk only in English.

    I know so many tamilians (Really so many), if they are out of Tamilnadu, they first look for tamil shops (may be these guys are ardent tamilians) and they continue to go to that shop only! They pull others too to that shop convincing that those shops/seloon/etc. are good! For friend’s sake, no one tells it is really bad!

    When we had a team tour, one guy burnt a CD with all tamil songs and started playing, think of other 5 guys! After we fill gas in our car, he could not find that CD, as one of our friends threw it away!

    These are just humorous terrorism examples!

    They dont allow Hindi at the level state syllabus! Only tamil. This is also language terrorism.

    Basically we can understand one thing, whereever tamils go, beatings follow them! 🙂 Srilanka, malaysia, karnataka and canada. There is a simple reason behind this, they want to have a more-then-expected favor from the governments in a manner that whole world should know! 🙂 Hilarious, right? They have just more-than-compelled love towards tamil. For tamil and their recognition, they do some chumma tricks. We all know, how was the tamil-desam earlier. Eat tamil, sleep tamil, drink tamil. God knows about the other guys! That is language terrorism only!

    Everyone knows this boss! 🙂 Tamils are peculiar!

    How much should I write boss! How much?

    Hail tamils. Nail tamils. 🙂 Enjoy!

  14. Krishna permalink
    13 జనవరి, 2010 7:59 సా.

    Sorry…

    I did not answer all your questions in your comment.
    Now I give a small try to do that!

    IT IS REALLY FUNNY TO TALK AND COMMENT ON TAMILS. I LOVE IT. (INFACT WE)

    “You might have origins from Tamilians sir!”, This is what I wrote!

    My guess exactly correct, because the situation in our India is like (South India at least) praising the other language is a sin! This gyan was given by only tamilians.

    Andhrites are really neutral guys! These tamils added petrol to the language of Kannada and burnt this ‘UNCONDITIONAL’ love towards the language. We know, what all happened in Karnataka for tamils. Now the situation is like, Kannada guys will not praise Tamil and vice versa. Felt-bad-cos-of-Tamils are also behaving the same!

    Who is the reason boss? Who has unexpected-false-pride-over-language among Indians? Only tamils. THis is just language terrorism.

    I DONT MIND IN COINING THIS TERM – “LANGUAGE TERRORISM”.
    I just talked infront of all my team members. No one could not find mistake with me except tamils. At least other guys should stop me right? But nothing happened. Because everyone at least felt a bit of that terror-attack! 🙂 🙂

    I expected you are a tamilian because, tamils only can praise tamil.

    We know… Telugu dies, Kannada dies. In india by 2020 Hindi and tamil will be the leading languages of India.

    ANDHRITES – let us save our LATIN OF THE EAST – TELUGU in PEACEFUL way.

    LONG LIVE TELUGU! LONG LIVE TELANGANA – SLANG. LONG LIVE ANDHRA. 🙂

    Krishna

  15. Krishna permalink
    13 జనవరి, 2010 8:08 సా.

    Do not mistake, I do have very good tamil friends! They are not terrorists! 🙂

    Sorry… I feel like, my comments added some burning to this page! if you would like to delete them, please delete them!

    But before you delete them, I forwarded this to all my team mates. 🙂 🙂

  16. 14 జనవరి, 2010 10:18 సా.

    @Krishna,

    Why do you think your comments might be deleted, especially when I find your comments more than endorse my feelings expressed in the post! I don’t want to extend this line of argument though.

    “LATIN OF THE EAST – TELUGU” ??? You have a flair for coining new phrases, I must admit 🙂 .

  17. Krishna permalink
    15 జనవరి, 2010 9:09 ఉద.

    No… I never talked/commented like that Chandra. Even I felt bad. I shouldn’t have talked like that while I was having tamil friends!

    If any tamilian happened to see these comments, they may get hurted. That is why I asked you to delete them!

    And coming to “LATIN OF THE EAST”, it’s not my idea to call telugu as that, but its in Wikipedia – I came to know through! The reason is…
    “It has soft melodious sounds with lot of vowel sounds and words ending in vowels.” – Main reason to have more carnatic music in TELUGU.

    It is renowned one. TELUGU is the sweetest Asian language! Really! It is not biased decision.

    And, I tell you – I dont have any grudge on Tamil Chandra. I do love tamil music, particularly Vidya sagar’s some particular compositions like, Poovaasam purappadum penney, azhagooril (May be wrong word), kaadhal vandhadum, and our rahman’s.

    I believe, telugu is so much sophisticated for music because of the ending of words – HALANTHAM. That is why I believe Tyagaraja and Muthuswamy Dikshita’s compositions are mostly in Telugu.

    We should be proud for telugu. I am scared, It will be in crisis of identity.

    Please visit my blog at http://maverick6chandu.wordpress.com/

  18. 15 జనవరి, 2010 10:04 సా.

    ఓ కూనలమ్మ వ్రాసినది ఒక సామాన్య, ఆజ్నాత ‘ వెటకార తెలుగుకవి’ కాదు.
    ఆయన మహా కవి ఆరుద్ర – తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి అర్థం చెప్పిన వ్యక్తి,
    ఆయన రాసిన కూనలమ్మ పదాలు, ఇంటింటి పజ్యాలు హాస్యం గురించి వ్రాసిన అందమైన కవితలు
    ఆరుద్ర సినిమా కవి మద్రాసులో తమిళుల మధ్యలో వుండి సరదాగా రిలీఫ్ గురించి ఆ కవిత వ్రాసి వుంటారు
    తమిళులు కూడా సరదాగా నవ్వుకొని వుంటారు.
    రచయతల పేరు వ్రాసి క్రెడిట్ తప్పకుండ ఇవ్వాలి

  19. 15 జనవరి, 2010 11:12 సా.

    @ Chitralekha45,

    ఆరుద్రను, శ్రీశ్రీ ని తెలియని పాఠకులుంటారని భావించకపోవడం వలననే ప్రత్యేకంగా వ్రాయలేదు, అంతేగానీ వ్రాయకూడదని కాదు. కాకపోతే ’మహా కవి’ , ’తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి అర్థం చెప్పిన వ్యక్తి’ – ఇది మీ వ్యక్తిగత అభిప్రాయంగా క్రెడిట్ తీసుకోండి:). సమగ్రాంధ్ర సాహిత్య గ్రంధ కర్త ఐనంత మాత్రాన ఆరుద్రను అంత గొప్పగా వర్ణించిన వారిని మిమ్మల్నే చూశాను నేను! ఏమిటో తెలుగు సాహిత్యానికి ఆయన చెప్పిన అర్థం!!

  20. 16 జనవరి, 2010 10:39 ఉద.

    Thank u, with your comment, I again read about ‘Aarudra’.(1925-1998) He is multi faceted and prolific telugu writer. A great poet (tvamevaaham, koonalamma padaalu,clerk suryarao, intinti pajyaalu sudda madhyakkaralu etc) wonderful cine lyricist (konda gaali tirigindi, andaala raamudu enduvalana demudu etc., essayist on 2nd world war, literary critic- Raamudi ki seetha yemavuthundi, and the magnum opus-‘ Samagra Aandhra Saahityamu, etc.It seems he also translated ‘Tamil ‘ Tirukkural into telugu.
    It is my personal view as you rightly said. Aarudra has to be considered as ‘Maha Kavi’ he is a better poet and writer than Mahakavi Sri Sri his contemporary and close relative. Sri Sri writings and poems are in tune with communist idealogy and because of that his place as ‘Mahakavi is assured because of political ideology’ than by the his literary output.
    Aarudra in his poems revealed the joys and travails of middle class house holder. epics live on paper. His film songs and lyrics live on the tongues of people eternally.

  21. 18 జనవరి, 2010 11:28 సా.

    చంద్రమోహన్ గారు,

    ఈ టపాలో మీ బాధని నేను అర్థం చేసుకోగలను కాబట్టి ఇంతవరకూ దీనికి వ్యాఖ్య రాయలేదు. తమిళం పరభాషా ప్రభావానికి లొంగలేదన్న అసూయ తెలుగువాళ్ళకుందన్న నిరాధారమైన అభియోగాన్ని కూడా అందుకే క్షమించేసాను 🙂
    ఇవాళ పేపర్లో చూసిన ఒక వార్త నేనీ వ్యాఖ్య రాయడానికి ప్రేరేపించింది. కరుణానిధిగారు తన మిత్రుని మనవడి పెళ్ళికి వెళ్ళారట. ఆ పెళ్ళికొడుకు పేరు ప్రదీప్. అది కరుణానిధిగారికి తమిళ పేరులా అనిపించలేదు. అక్కడికక్కడే తన ఆవేదనని వ్యక్తం చేసి, అతని పేరుని మార్చివేసి కొత్త పేరుపెట్టేసారట! తనకి తమిళ భాషపై ఉన్న అభిమానాన్ని గురించి నొక్కివక్కాణిస్తూ, తన పిల్లలకి మనవలకి తమిళ పేర్లే పెట్టానని కూడా చెప్పుకున్నారట (స్టాలిన్ ఎంత తమిళ పేరో?! తన పేరెంత అచ్చమైన తమిళమో?!). ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు ఎలా ప్రతిస్పందించాలంటారు? ఇక్కడ ఇది ఎవరో ఒకానొక సాధారణ తమిళుని విషయం కాదే!

    తమిళుల మీద తెలుగువాళ్ళకి చారిత్రకమైన ద్వేషం ఉన్నదనడానికి ఆధారాలు లేవు. శ్రీనాథుని గురించి మీరే చెప్పేసారు కాబట్టి మళ్ళీ నేను వివరించనక్కర లేదు. తెలుగు, సంస్కృత భాషా ప్రభావానికి లొంగిపోయిందన్న భావన మనకి చాలా ఆధునికమైనది. ద్రవిడ, దళిత ఉద్యమాల ఫలితంగా వచ్చిన భావన అది. తమిళమ్మీద విసురులు విసిరిన కవులిద్దరి మీద వీటి ప్రభావం ఏమాత్రం లేదన్నది సుస్పష్టం. ద్రవిడ ఉద్యమ నాయకులు తమ స్వార్థం కోసం తమిళ భాష, జాతి పట్ల అభిమానంతో బాటు ఇతరుల మీద చులకన/ద్వేషం కూడా (అంతకుముందెన్నడూ లేనివి) ప్రజలలో రగిల్చారని నాకు అనిపించే విషయం. దానికి ప్రతిస్పందనే తెలుగువాళ్ళకి (ఇతరులకీ) తమిళులపట్ల విముఖతకి కారణం. ఇక్కడ చెన్నైలో ముప్ఫై ఏళ్ళుగా ఉంటున్న కొందరు తెలుగువాళ్ళతో మాట్లాడినప్పుడు, తెలుగు భాషని ప్రభుత్వం కోరుండి అణగద్రొక్కిందని అన్నారు.

    ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఇక్కడ సాఫ్ట్వేరు కంపెనీలలో కూడా తమిళవాళ్ళు తమవాళ్ళకే ప్రాధాన్యం ఇస్తారని కొంతమంది అంటూ ఉంటారు. కాని అది కేవలం వాళ్ళ దృష్టిదోషమేమో అని నా అనుమానం. ఎందుకంటే పన్నెండేళ్ళగా ఇక్కడ పనిచేస్తున్నా నాకలాంటి అనుభవం కలగలేదు!

  22. 19 జనవరి, 2010 10:10 సా.

    కామేశ్వర రావు గారు,

    మీ కామెంటు చదివిన తరువాత ఎక్కడో పొరబాటు జరిగిందని నాకు ఖచ్చితంగా అర్థమైపోయింది. నేను చెప్పాలనుకున్నదానికి భిన్నమైన భావం మీక్కూడా తోచిందంటే నేను వ్రాయడంలోనే ఏదో తేడా ఉండాలి!

    భాషపై వ్యతిరేకత ఉండడానికి, భాషీయులపై వ్యతిరేకత ఉండడానికి తేడా ఉందని నేననుకుంటున్నాను. తమిళులు ఒక వేళ నిజంగానే చెడ్డవారయి ఉన్నా వారిపై ఉన్న అభిప్రాయం, వారి భాష పట్ల కూడా ఉండనవసరం లేదు కదా! మనం ఆంగ్లభాషను ఇష్టపడినంతగా ఆంగ్లేయులను ఇష్టపడక పోవచ్చు. ఒక భాషను, దానిలోని సాహిత్యాన్ని చదవకుండా ఆ భాషపై ఒక అభిప్రాయం ఏర్పరుచుకోవడం తర్క విరుధ్ధం (illogical) అని నా భావన.
    ఇక, మీరు చెప్పిన అభియోగం నేను చేయలేదు, ప్రత్యేకించి తెలుగు వారి విషయంలో అస్సలు చేయలేదు. ‘ఇతరులలో’, ‘బహుశ’ అన్న పదాలు చూడండి! నేను వాడిన పదం కూడా అసహనమే కానీ అసూయ కాదు. కనుక నిస్సందేహంగా నేను క్షమార్హుడినే 🙂

    ఇక నా టపా అంతా అకారణంగా (కనిపించే) తమిళ భాషా ద్వేషం గురించేకానీ తమిళులందరూ మంచివాళ్లనే తప్పుడు అభిప్రాయం నాకు లేదు. ఒక కవిగా తప్ప, ఒక నాయకుడిగా, ఒక వ్యక్తిగా కరుణానిధి ప్రవర్తనంటే నాకు అసహ్యం. కరుణానిధి చేసే తిక్క పనులను నిరసించేవారిలో నేను కూడా ఉన్నాను. ముఖ్యంగా తమిళ సంవత్సరాదిని ఏప్రిల్ 14 నుండి పొంగల్ నాటికి మార్చాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసినా, మేము, చాలా మంది నేనెరిగిన వారు పాత పధ్ధతినే అనుసరిస్తున్నాము. (ఐనా సరే, స్టాలిన్ అని తన అభిమాన నాయకుడి పేరును, అదే భాషదైనా, పెట్టుకోవడానికీ, ఇతర భాషల పేరు పెట్టక పోవడానికీ తేడా ఉందన్న విషయం మీరొప్పుకోవాలి. ‘గాంధి’ అన్న పేరు పెట్టుకోవాలంటే దాన్ని అనువదించుకోము కదా! ఆయన ఇతర పిల్లలందరికీ తమిళ పేర్లే పెట్టాడన్న విషయాన్ని విస్మరించలేము. ఇక ఆయన పేరు ఆయన పెట్టుకున్నది కాదు కదా!)

    తెలుగు సంస్కృత ప్రభావానికి లొంగిపోయిందన్న మాట కూడా నేనెక్కడా అనలేదు, అది నిజమే ఐనా 🙂 ఆ వాదన కొత్తదైతే కావచ్చుకాని, నిజం పాతదే. ‘ఇతర భాషలు’ అని నేనన్నది ముఖ్యంగా ఆంగ్లాన్ని ఉద్దేశించి. సంస్కృత ప్రభావంలేని తెలుగుని నేను ఊహించుకోలేను కూడా. తెలుగులో కొత్త పదాల నిర్మాణం సంస్కృత ధాతువుల ఆధారంగానే జరగాలని నాకో గట్టి అభిప్రాయం (అది వేరే చర్చ అనుకోండి).

    “తమిళుల మీద తెలుగువాళ్ళకి చారిత్రకమైన ద్వేషం ఉన్నదనడానికి ఆధారాలు లేవు. ” అన్నారు. నిజమే కానీ, తమిళం కాక ఇతర భాషలపై సాధారణంగా ఇలాంటి తేలిక అభిప్రాయాలు ఉన్నట్లు కూడా ఆధారాలు లేవు. Circumstantial Evidence నాకు అలాంటి అభిప్రాయాన్ని కలిగించింది మరి!

    తమిళనాట చాలాకాలంగా ఉంటున్న తెలుగు వారిగా, తమిళ ప్రజల్లో ఇతరుల పట్ల ద్రవిడ ఉద్యమం రగిల్చిన ద్వేషం లాంటిది ఉందో లేదో చెప్పాల్సింది మీరే. నేనేమీ చెప్పలేను.

    ఏదేమైనా ‘అయ్యవారిని చేయబోతే కోతి అయింద’న్నట్లు ఒక విషాద హాస్యం లాంటిది ఒలికించడానికి నేను చేసిన ప్రయత్నం దారి తప్పినట్లే కనిపిస్తోంది.

    వ్యాఖ్యకు ధన్యవాదాలు!

  23. 4 ఫిబ్రవరి, 2010 5:30 సా.

    మీ టపా ఇదివరకే చూశాను కానీ కామేశ్వర్రావు గారి వ్యాఖ్య అప్పుడు లేదు. అలానే ఈ మధ్య ఆరుద్ర పుస్తకమొకటి కొన్నాను. అంచేత నావి ఓ రెండు వరహాలు.

    ఆరుద్ర వెటకారం నిందాపూర్వకం కాదేమో? (మీరు హర్ట్ అయితే చేసేదేమీ లేదు. :-)) ఈ మధ్యే ఆయన పుస్తకం ఒకటి వెలువడింది, వెలుగు-వెన్నెల అని. ఆ పుస్తకం “జయంగొండాన్” కు ఆయన తర్జుమా. తమిళ సాహిత్యం పట్ల, తమిళుల పట్లా ఆయనకు మక్కువే తప్ప తక్కువ లేదని నా ఉద్దేశ్యం. అలానే సమగ్రాంధ్ర సాహిత్యం మొదట్లో ఆయన తమిళుల గురించి సానుకూలంగా ప్రస్తావించారు.

    ఇక అరవ్వాడు, ఇటువంటివి కాస్త సహజం అని నేననుకుంటున్నాను. మలయాళీ ప్రస్తావన వచ్చినప్పుడు అమ్ముకుట్టి అని, కన్నడిగుడైతే కన్నడ కస్తూరి అని, బెంగాలీ అయితే బాబూమోషాయ్ అని, అలానే తమిళులను అరవ్వాడని ప్రస్తావించడం సామాన్యం. ఇందులో ప్రత్యేకించి ద్వేషభావన ఉండదనుకుంటున్నాను. (ఈ వాదనా అన్ని వేళల్లో సరికాదనుకోండి). అలానే తమిళ సినిమాల్లో హిందీని, తెలుగును (అక్కడ చూడు – ఇది ఫేమస్ అనుకుంటాను) కాస్తంత వెటకారంగా మాట్లాడ్డం మామూలే.

    “ಮಾಸ್ತಿ ಕನ್ನಡದ ಆಸ್ತಿ” – మాస్తి వెంకటేశ అయ్యంగారు గారిది కోలారు జిల్లా మాలూరు తాలూకా మాస్తి గ్రామం. పెరిగి పెద్ద అయినది కన్నడిగుల మధ్య, కన్నడ చదువు చదువుతూనూ. “చిక్కవీర రాజేంద్ర” పుస్తకంలో సామాన్యుల కన్నడ నుడికారం దగ్గర్నుంచీ, రాజులు మాట్లాడే కన్నడ వరకూ చెప్పినాయన – పేరులో అయ్యంగారు ఉంటే మాత్రం – ఆయన తమిళ కుటుంబం ఎలాగండి?

  24. ప్రత్యుత్తరమిమ్ము permalink
    24 ఏప్రిల్, 2010 1:16 ఉద.

    .I.

వ్యాఖ్యలను మూసివేసారు.