విషయానికి వెళ్ళండి

About

జనని తమిళ భాష తెనుగు పెంచిన తల్లి
జనకుడాంగ్ల భాష జగము జూపె
పొరుగు కన్నడమ్ము గురువు గీర్వాణమ్ము
బంధు జనములితర భాషలెల్ల

One Comment leave one →
  1. S Narasimha permalink
    2 డిసెంబర్, 2023 6:23 సా.

    బాబూ… భాషా ప్రవీణా! “ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి” అంటే ఇమ్మని అడుగుతున్న జేశ్వరాధములకు నేను నా భాగవతాన్ని ఇవ్వనుగాక ఇవ్వను అని పోతనగారు అనుకుంటున్నారు అని నువ్వనుకున్నావు… అదే నిజమైన పక్షంలో ‘ఇమ్మను’ కు… ‘జేశ్వరాధములకు’ మధ్య స్పేస్ రావాలి… కానీ రాలేదు… పోతనగారు స్పేస్ క్రియేట్ చేసుకోవాలి అనికూడా అనుకోలేదు… ఎందుకంటే ఆయన పదాలు వేరు… ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి అంటే… ఈ + మనుజ + ఈశ్వరులకు + ఇచ్చి అని… మనుజేశ్వరులు అంటే రాజులు… ఈ రాజులు గనక ఎవరైనా తన భాగవతాన్ని అంకితం ఇవ్వమని అడిగితే… చచ్చినా అటువంటి పనిని చెయ్యను. భాగవతం శ్రీహరిది… కాబట్టి నా భాగవతమనే కావ్యలక్ష్మిని ఆయనకే ఇస్తాను అని…

    ఇంకో మాట అన్నావ్… ఆయన్ని ఎవరైనా అడిగారా ఇమ్మని అని… ఆ రోజుల్లో కావ్యాల్ని ప్రబంధాల్ని అంకితం పుచ్చుకోవడం ఒక సత్కారంలా ఉండేది రాజులకు… అలా ఇచ్చిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి చరిత్రలో… పోతరాజులవారిని కూడా సింగభూపాలుడు అనే రాజు చాలా బ్రతిమిలాడాడు… భయపెట్టాలని అనుకున్నాడు, ఇబ్బందులకు గురిచేశాడు… అయినా సద్భాగవతుడైన పోతన దేనికి చెణకకుండా ఆ శ్రీహరి స్వరూపం అయిన ఒంటిమిట్ట రామచంద్రులవారికి అంకితం ఇచ్చి తన జన్మను చరితార్థం చేసుకున్నాడు…

    మహనుభావులలో తప్పులు వెతికి అదేదో ఘనకార్యం అనుకోకు… నాలాంటి అడ్డుగోడలు తగుల్తాయి…

వ్యాఖ్యానించండి