విషయానికి వెళ్ళండి

పేద కవి ఉత్తరం!

18 ఫిబ్రవరి, 2010

తెరపినివ్వని దగ్గు తెరల మధ్య ఖళ్ళు ఖళ్ళు మంటూ
పేద కవీశ్వరుడు ప్రభుత్వంవారికిలా ఉత్తరం వ్రాశాడు
“అద్దె కట్టలేక వచ్చిన గొడవలతో మారుతూ మారుతూ
ఇప్పుడు నేనుంటున్నది ఇరవైయేడో యిల్లు
దగ్గి దగ్గి, రేపెప్పుడో నే చస్తే, నా స్మారక మందిరం కోసం
ఎన్ని ఇళ్ళని మీరు కొని చస్తారు?”

(తమిళ కవి వైరముత్తు కవితల సంకలనంలోని ఒక కవితకు నా అనువాదం)

3 వ్యాఖ్యలు
  1. 19 ఫిబ్రవరి, 2010 10:24 ఉద.

    బాగుందండి..

  2. 19 ఫిబ్రవరి, 2010 5:33 సా.

    మంచి ప్రయత్నం. బాగుంది.

  3. Sowmya permalink
    29 ఆగస్ట్, 2010 5:40 సా.

    Interesting Poem!!!

వ్యాఖ్యలను మూసివేసారు.